టైటిలే పెట్టకున్నా.. రామ్-బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఖరారు

  • సెప్టెంబర్ 15న విడుదల కానున్న చిత్రం
  • రామ్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రీలీల
  • ఐదు భాషల్లో విడుదల కానున్న సినిమా
ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ లుక్ లోని రామ్ పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయకున్నా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానుంది. 

ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెల్ల చొక్క, పంచెలో పొలంలో మంచం వేసుకొని రామ్ సరదాగా కూర్చున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాకు థమన్ సంగీతం అందించగా, శ్రీనివాస చిత్తూరి నిర్మించారు.
 

ram potineni
Boyapati Sreenu
new movie
srileela
Release
15th sep
pan india

More Telugu News